హౌసింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పోచారం
Published on 13 Apr 2026, 08:05 PM 88
JH-75901
జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ లోని తన నివాసం వద్ద ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై బాన్సువాడ నియోజకవర్గ ఎంపీడీవో లు, హౌసింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్ శ్రీమతి కిరణ్మయి పాల్గొన్న బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు.
ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ...ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసుకునేలా చూడాలని పనులు నెమ్మదిగా ఉన్న చోట లబ్ధిదారులతో సంప్రదించి సమస్యలు ఉంటే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొచ్చి సమస్యలను పరిష్కారించాలని సూచించారు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తూ బిల్లుల చెల్లింపుల విషయంలో ప్రతి దశలో బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జూన్ నెలాఖరు వరకు పూర్తి అయ్యేలా చూసి లబ్ధిదారులచే వెంటనే గృహప్రవేశాలు చేయించాలని తెలిపారు. ఏదైనా సమస్యలచే ఇళ్లు మంజూరు అయి ఇప్పటి వరకు నిర్మాణ పనులు ప్రారంభించకపోతే లబ్ధిదారులచే సంప్రదింపులు జరిపి త్వరిత గతిన నిర్మాణం పూర్తి చేసే విధంగా ప్రోత్సహించాలని సూచించారు.
