హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
హనుమాజీపేట్ లో హెచ్ పి వి వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభం JH-69469

జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో హనుమాజీపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్పివి (హెచ్ పి వి ) వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. మహిళలు మరియు బాలికల ఆరోగ్య రక్షణలో ఈ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుందని వైద్యులు తెలిపారు.

ఈ సందర్భంగా ఈ వ్యాక్సిన్‌ను ముఖ్యంగా 14 నుండి 15 సంవత్సరాల లోపు బాలికలకు మాత్రమే ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ (ప్రత్యేకంగా గర్భాశయ క్యాన్సర్) రాకుండా ముందస్తు జాగ్రత్తగా ఉపయోగపడుతుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసన్న మీనా, గ్రామ సర్పంచ్ లావణ్య, హెల్త్ సూపర్వైజర్ మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వారు హెచ్పివి వ్యాక్సిన్ అవసరం ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉచిత సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకుని, తమ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అధికారులు కోరారు.

Click to join Whatsapp channel
Janahitham News
హనుమాజీపేట్ లో హెచ్ పి వి వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభం
హనుమాజీపేట్ లో హెచ్ పి వి వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభం

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్