హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
నాచుపల్లిలో అర్ధరాత్రి దొంగల దాడి… 6 ఇళ్లలో భారీ చోరీ JH-39879

జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో నస్రుల్లాబాద్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆరు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. మండలంలోని నాచుపల్లిలో.., నస్రుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామం లో ఆదివారం అర్ధరాత్రి చోరీ ఘటన కలకలం రేపింది. గ్రామంలోని ఆరు ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దుండగులు చోరీలకు పాల్పడ్డారు. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.

గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.., వివిధ పనుల నిమిత్తం బయట గ్రామాలకు వెళ్లిన కుటుంబాల ఇళ్లలో అర్ధరాత్రి సమయంలో తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఆయా ఇళ్లల్లో నగదు, బంగారం, వెండి ఆభరణాలు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
నాచుపల్లిలో అర్ధరాత్రి దొంగల దాడి… 6 ఇళ్లలో భారీ చోరీ
నాచుపల్లిలో అర్ధరాత్రి దొంగల దాడి… 6 ఇళ్లలో భారీ చోరీ

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్