హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
“నా ఫోన్ కూడా ఎత్తడం లేదు”… మంత్రులపై పోచారం ఫైర్ JH-78563

జనహితం న్యూస్, కామారెడ్డి: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో వర్ని మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ వద్ద ఆదివారం రాత్రి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మంత్రులపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

మంత్రులు ఫోన్ ఎత్తడం లేదు...

పెండింగ్ బిల్లుల విషయమై మంత్రులకు ఫోన్ చేస్తే ఎత్తడం లేదని.., ప్రభుత్వసలహాదారుగా, సీనియన్ ఎమ్మెల్యేగా ఉన్న తన ఫోన్కాల్ లిఫ్ట్ చేయకపోవడం ఎంత వరకు సబబని ఆయన ప్రశ్నించారు. సీఎంకు సుమారు 20 సార్లు ఫోన్ చేసినా స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘సీనియర్ ఎమ్మెల్యే అయిన నా ఫోన్ కూడా ఎత్తడం లేదని, ఇక నేను మంత్రుల కాళ్లు మొక్కాలా?” అని ప్రశ్నించారు. బిల్లులు రాక పనులు ఆగిపోతున్నాయని, ప్రభుత్వం నుంచి బిల్లులు విడుదల కాకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయని తెలిపారు.

కాంట్రాక్టర్లు పనులు వదిలి వెళ్లిపోతున్నారు...

కాంట్రాక్టర్లు పనులు వదిలి వెళ్లిపోతున్నారని, బిల్లులు రాక ఎలా పని చేయాలని వారు ప్రశ్నిస్తున్నారని పోచారం పేర్కొన్నారు. అయినప్పటికీ కాంట్రాక్టర్లను బతిమిలాడుతూ పనులు కొనసాగిస్తున్నామని చెప్పారు. 20 ఏళ్లు మంత్రిగా పనిచేసిన తాను ఎవరైనా ఫోన్ చేస్తే అర్ధరాత్రి అయినా స్పందించేవాడినని, కానీ ఇప్పుడు మంత్రులు ఫోన్ ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని పోచారం వ్యాఖ్యానించారు. ప్రజల కోసమే ఫోన్ చేస్తున్నాం.., ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మంత్రులను సంప్రదిస్తున్నామని, అలాంటి సందర్భాల్లో కూడా స్పందన లేకపోతే ప్రజాప్రతినిధుల పాత్ర ఏమిటని ప్రశ్నించారు.

Click to join Whatsapp channel
Janahitham News
“నా ఫోన్ కూడా ఎత్తడం లేదు”… మంత్రులపై పోచారం ఫైర్
“నా ఫోన్ కూడా ఎత్తడం లేదు”… మంత్రులపై పోచారం ఫైర్

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్