హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం JH-91343

జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం లోని గిర్నీతండా గ్రామపంచాయతీలో పిట్లం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించినారు చైర్మన్ చికోటి మనోజ్ కుమార్, మండలకాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పశు శిబిరాన్ని నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేయడం, పశువుల ఆరోగ్యాన్ని కాపాడడం ప్రధాన లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరానికి పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు హాజరై తమ పశువులకు వైద్య పరీక్షలు చేయించుకుని, ఉచితంగా మందులు పొందారు.పశువులకు వచ్చే వివిధ వ్యాధులపై పరీక్షలు నిర్వహించడంతో పాటు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు రైతులకు అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు సవాయి సింగ్, గిర్నీతండా సర్పంచ్ మారోని బాయి, సింగితం సర్పంచ్ రఫీ, నాయకులు ఆకాష్, జగమాల్, రాజు, సంతోష్ రాథోడ్, ఏఎంసీ డైరెక్టర్ కృష్ణ, బలరాం, కార్యదర్శి శ్రీకాంత్, సూపర్వైజర్ నాగరాజు, డాక్టర్ సయ్యద్ యూనిస్, గోపాల మిత్ర నందు, సిద్దు, రఘు మరియు మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం
మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్