కామారెడ్డి కాంగ్రెస్ కార్యాలయంలో ‘ZIPCK’ 3in1 డెలివరీ ప్లాట్‌ఫామ్ పోస్టర్ ఆవిష్కరణ.
Published on 01 Apr 2026, 06:37 PM 38
JH-75112
జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ZIPCK INDIA'S FIRST 3in1 Delivery Platform పోస్టర్‌ను జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని ప్రజలకు వేగవంతమైన మరియు సులభమైన సేవలు అందించేందుకు ఈ తరహా డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, స్థానిక వ్యాపారాల అభివృద్ధికి కూడా ఇది తోడ్పడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని, ZIPCK సంస్థ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.
