హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
బిజెపి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరించిన పట్టణ అధ్యక్షుడు JH-26436

జనహితం న్యూస్, కామారెడ్డి: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బాన్సువాడ బిజెపి పార్టీ కార్యాలయంలో బిజెపి జెండాను పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు కొనాల గంగారెడ్డి మాట్లాడుతూ 1980 సంవత్సరం ఏప్రిల్ 6 నాడు భారతీయ జనతా పార్టీ స్థాపించడం జరిగింది. అప్పటి మాజీ ప్రధానమంత్రి అటల్ బీహార్ వాజ్పేయి, ఎల్ కె అద్వానీ స్థాపించడం జరిగింది మొట్టమొదటి బిజెపి జాతీయ అధ్యక్షులుగా అటల్ బీహార్ వాజ్పేయిని ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో బిజెపి రెండు పార్లమెంటు స్థానాల నుండి 303 స్థానాల వరకు ఎదిగి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం జరిగింది. ఈరోజు దేశంలో 44 కోట్ల పార్టీ సభ్యత్వంతో పాటు 19 రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉందని అన్నారు.

2014లో నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో తిరుగులేని పార్టీగా మూడు సార్లు దేశంలో అధికారంలో కొనసాగుతుందని. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా బిజెపి పార్టీ అధికారంలోకి వస్తుందని, దేశ ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని, నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు వైపు ప్రజలు బిజెపి వైపు చూస్తూ ఉన్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చిదుర సాయిలు, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, కిషన్ మోర్చా, జిల్లా కార్యదర్శి మోహన్ రెడ్డి, బిజెపి మున్సిపాలిటీ కౌన్సిలర్ గజ్జల మహేష్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి రెడ్డి, బిజెపి మాజీ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, బిజెపి మాజీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి, సిద్ది బాలరాజ్, బిజెపి నాయకులు చీకట్ల రాజు పాశం, భాస్కర్ రెడ్డి, శ్యామల శ్రీకాంత్, కొండని గంగారం శంకర్, మహేందర్, రఘువీర్, నాగరాజు, సాయి రెడ్డి, పురుషోత్తం, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Click to join Whatsapp channel
Janahitham News
బిజెపి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరించిన పట్టణ అధ్యక్షుడు
బిజెపి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరించిన పట్టణ అధ్యక్షుడు

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్