బర్త్‌డే రోజునే బలం పెంచుకున్న రవీందర్ రెడ్డి వర్గం
Published on 06 Apr 2026, 09:03 PM 100
JH-54952
జనహితం న్యూస్, కామారెడ్డి: మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా హైదరాబాదులోని ఆయన సొంత నివాసంలో బాన్సువాడ కాన్స్టెన్సీ నుంచి వివిధ మండలాల నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి యొక్క సైన్యం తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా బాన్సువాడ ముదిరాజ్ సంఘం టౌన్ అధ్యక్షులు ఉప్పరి లింగం (ముదిరాజ్) వారి సంఘానికి సంబంధించిన నాయకులు, యువజన సంఘం సభ్యులు మరియు బిజెపి పార్టీ నుంచి ముఖ్య నాయకులు, యువకులు మరియు బాన్సువాడ సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ వాళ్ళ పాలకవర్గం సభ్యులు ఈరోజు ఏనుగు రవీందర్ రెడ్డి (బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే) సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఏనుగు రవీందర్ వెంటే ఉంటామని ఈరోజు ఆయన సమక్షంలో 250 మంది పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరులు ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం లో చేరి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీలో కలిసిన వారందరికీ రవీందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపి అన్ని విధాల అండగా ఉంటానని ఎల్లవేళలా కార్యకర్తల యొక్క సంక్షేమానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది.
