గాంధారిలో బాలికలకు పోలీసుల అవగాహన – సైబర్ మోసాలు, భద్రతపై కీలక సూచనలు
Published on 06 Apr 2026, 09:15 PM 93
JH-94576
జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ.ఎం.రాజేష్ చంద్ర ఐపీయస్ ఆదేశానుసారం గాంధారి సబ్-ఇన్స్పెక్టర్ ఆంజనేయలు ఆధ్వర్యంలో పోలీస్ కళాబృందంచే అవగాహనా కార్యక్రమం. అత్యవసర సమయంలో డైల్ 100 కాల్ చేయాలని, మహిళలకు బాలికలకు సమస్య వస్తే షి టీమ్ నం 8712686094 కాల్ చేయాలనీ, సైబర్ మోసలైతే సైబర్ నేరాల టోల్ ఫ్రీ నం 1930, ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్ సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని, మంచి లక్ష్యంతో చదువు కోవాలని, ఏచిన్న పొరపాటు చేసిన జీవితాలు నాశనం అవుతాయని, తల్లి తండ్రులు చెప్పినట్టు వినాలని పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ యు.శేషరావు, PCs ప్రభాకర్, సాయిలు మాటలు పాటలు ద్వారా కార్యక్రమం చేయడమైనది.
ఈకార్యక్రమంలో AHTU PC.రాజేందర్ ప్రిన్సిపాల్ శిల్ప ఉపధ్యాయు బృందం మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.
