బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి రాష్ట్రస్థాయి పురస్కారం
Published on 07 Apr 2026, 04:47 PM 102
JH-25881
జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి గతంలో ఉత్తమ సేవలు అందించి ఎన్నో అవార్డులు అందుకున్న మరచిపోక ముందే తాజాగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ ప్రతిభ చూపిన ఆరోగ్యశాఖ సిబ్బందిని ఆసుపత్రులను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అందులో మన బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఉండడం మన నియోజకవర్గానికి గర్వ కారణం. బాన్సువాడ ఆసుపత్రిలో అధికంగా ప్రసవాలు జరగడంతో బాన్సువాడ ఆసుపత్రిని ప్రభుత్వం ఉత్తమ ఆసుపత్రిగా ఎంపిక చేసింది.
హైదరాబాదులోని రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాష్ట్ర, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ఆసుపత్రి సూపరింటెండెంట్, డిసిహెచ్ఎస్ డాక్టర్ విజయభాస్కర్ అవార్డును అందుకోనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి ఉత్తమ అవార్డు రావడంతో వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ ను అభినందించారు.
అవార్డు మరింత బాధ్యతను పెంచింది ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా... డాక్టర్ విజయ భాస్కర్ (సూపరింటెండెంట్) బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి అవార్డు రావడం మరింత బాధ్యతను పెంచిందని సహకారం అందిస్తున్న అందరికీ ప్రత్యేక ధ న్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి ఈ అవార్డు అంకితం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్, సబ్ కలెక్టర్ కిరణ్మయికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారికి మరిన్ని వైద్య సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని వారు తెలిపారు.
