హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈరోజు ప్రారంభించిన పోచారం JH-70900

జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో సొసైటీ పరిధిలోని కొల్లూరు గ్రామంలో, మైలారం సొసైటీ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో, వర్ని సొసైటీ పరిధిలోని ఎస్ ఎన్ పురం, పాత వర్ని గ్రామాలలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈరోజు ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి. అనంతరం వర్ని మండల కేంద్రంలో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనం, సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన పోచారం పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, రైతులు ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి పోచారం మాట్లాడుతూ...రైతులు పండించిన ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుంది.

రైతులు తొందరపడి దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాలకు తరలించి గిట్టుబాటు ధర పొందాలి. ప్రభుత్వ మద్దతు ధర A గ్రేడ్ క్వింటాలుకు రూ 2389/-, B గ్రేడ్ క్వింటాలుకు రూ 2369/- దేశంలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే రైతుల నుంచి పూర్తిగా ధాన్యం కొనుగోలు చేస్తంది. రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురిచేయకూడదు.

Click to join Whatsapp channel
Janahitham News
యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈరోజు ప్రారంభించిన పోచారం
యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈరోజు ప్రారంభించిన పోచారం

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్