హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
అంబేద్కర్ జయంతి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ.. ఎల్లారెడ్డిలో సహా పంక్తి భోజనం JH-17402

జనహితం న్యూస్, కామారెడ్డి: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామంలో న్యాయ బోజ్ – సహా పంక్తి భోజనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఏలే మల్లికార్జున్ ముఖ్య అతిథిగా పాల్గొని, గ్రామ ప్రజలతో కలిసి సహా పంక్తిలో భోజనం చేసి సామాజిక సమానత్వం, ఐక్యతకు ప్రాధాన్యతను చాటిచెప్పారు. అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ, సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కలగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా స్థానిక సర్పంచులు, ఉపసర్పంచ్లు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Click to join Whatsapp channel
Janahitham News
అంబేద్కర్ జయంతి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ.. ఎల్లారెడ్డిలో సహా పంక్తి భోజనం
అంబేద్కర్ జయంతి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ.. ఎల్లారెడ్డిలో సహా పంక్తి భోజనం

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్