బాన్సువాడ ఆసుపత్రికి రాష్ట్ర అవార్డు.. పోచారం ప్రశంసలు
Published on 11 Apr 2026, 08:36 PM 80
JH-85929
జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో ఆరోగ్య వారోత్సవాల ముగింపు సందర్భంగా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని మాత శిశు సంక్షేమ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్న కామారెడ్డి జిల్లా డి సి హెచ్ ఎస్ ఆసుపత్రి సూపరిండెంట్ డా. విజయ భాస్కర్,డిప్యూటీ DMHO డా.విద్యా, పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది.
మొదటగా ఆసుపత్రిలో మహాత్మ జ్యోతి రావు పూలే జయంతి సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి మహాత్మ జ్యోతి రావు పూలే చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన పోచారం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈనెల 7వ తేదీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూరల్ ఏరియాలో అత్యధికంగా సాధారణ డెలివరీలు జరిగిన ఆసుపత్రిగా అవార్డు పొందిన ఆసుపత్రి వైద్యులను, వైద్య సిబ్బందిని అభినందించిన పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో గురు వినయ్, ఎజాస్, కృష్ణారెడ్డి, శ్రీధర్, మోహన్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
