హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
పదివేల ఎకరాలకు నీరు.. ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ ప్రారంభం JH-87421

జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో నిజాంసాగర్ నాన్ కమాండ్ ఏరియాలో పదివేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కీలకమైన జాకోర, చందూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా శనివారం పంపు మోటార్ల ట్రయల్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

వర్ని మండలంలో 106 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టారు. పంపు మోటార్ల పనితీరును పరిశీలిస్తూ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు ఈ పథకం అమల్లోకి వస్తే నాన్ కమాండ్ ఏరియాలోనీ రైతులకు సాగునీటి సమస్యలు తగ్గి పంటల ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు రైతులు ఆధునిక సాగు పద్ధతులు అవలంబించి లాభాలు పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఎత్తిపోత పథకాల సలహాదారులు వెంకటరెడ్డి, ఇరిగేషన్ సీ. ఈ శ్రీనివాస్, వర్ని, జాకోర, చందూర్ ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
పదివేల ఎకరాలకు నీరు.. ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ ప్రారంభం
పదివేల ఎకరాలకు నీరు.. ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ ప్రారంభం

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్