కాలభైరవ స్వామి సన్నిధిలో ఏలే మల్లికార్జున్ దంపతుల ప్రత్యేక పూజలు
Published on 10 Apr 2026, 07:46 PM 67
JH-43587
జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రతాల రామ్ రెడ్డి గ్రామంలో ఉన్న ప్రసిద్ధ కాలభైరవ స్వామి దేవాలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ దంపతులు పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా వారు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, జిల్లా అభివృద్ధి, ప్రజల సుఖసంతోషాలు, రాష్ట్ర శాంతి సమృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటూ, ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడే నాయకత్వాన్ని మరోసారి చాటిచెప్పారు. అనంతరం ఆలయ పూజారులు, ఈ ఓ దేవస్థాన కమిటీ చైర్మన్ మరియు గ్రామ పెద్దలు కలిసి ఏలే మల్లికార్జున్ దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించి, జ్ఞాపిక (మెమొంటో) ను అందజేశారు.
