హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
బాన్సువాడలో శ్రీరామనవమి శోభాయాత్రకు 15 ఏళ్ల ఘన చరిత్ర JH-38617

జనహితం న్యూస్, కామారెడ్డి మార్చ్ 26: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని గత 15 సంవత్సరాల క్రితం బజరంగ్ దళ్ అధ్యక్షుడిగా రుద్రంగి మురళి గుప్తా ఆధ్వర్యంలో ప్రారంభమైన రామనవమి శోభాయాత్ర అప్పటి నుండి ఇప్పటివరకు నిర్విరామంగా కొనసాగుతూ విశేష ఆదరణ పొందుతోంది. ఆదిలో సాధారణంగా ప్రారంభమైన ఈ శోభాయాత్ర,కాలక్రమేణా పట్టణ ప్రజల సహకారం,యువత ఉత్సాహం,భక్తుల భాగస్వామ్యంతో ప్రతి ఏడాది మరింత వైభవంగా మారింది.

శ్రీరాముని జయజయధ్వానాలతో, భజనలు, డప్పు వాయిద్యాలు, అలంకరించిన వాహనాలతో ఊరంతా భక్తి పరవశంతో నిండిపోతుంది. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తు, శోభాయాత్రలో భాగంగా శ్రీరామ, సీత, లక్ష్మణుల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి పట్టణ ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా నిర్వహించడంతో పాటు మార్గమధ్యంలో భక్తులు హారతులు ఇచ్చి, పూలు చల్లుతూ తమ భక్తిని చాటుకుంటారు.

ఈ శోభాయాత్ర కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాకుండా, పట్టణ ప్రజల ఐక్యత, సాంప్రదాయం, భక్తి భావాలను ప్రతిబింబించే ఆధ్యాత్మిక వేడుకగా నిలుస్తుందని, ప్రతి సంవత్సరం మరింత ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు కృషి చేస్తుండగా, ఇలా గత 15 సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ రామనవమి శోభాయాత్ర బాన్సువాడ పట్టణానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చి, భక్తి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోందనీ రుద్రంగి మురళీధర్ గుప్తా తెలిపారు.

Click to join Whatsapp channel
Janahitham News
బాన్సువాడలో శ్రీరామనవమి శోభాయాత్రకు 15 ఏళ్ల ఘన చరిత్ర
బాన్సువాడలో శ్రీరామనవమి శోభాయాత్రకు 15 ఏళ్ల ఘన చరిత్ర

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్