హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
బాన్సువాడలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ నాయకుల నిరసన JH-64813

జనహితం న్యూస్, కామారెడ్డి మార్చ్ 26: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి ఏవో వసంత వినతిపత్రం ఇవ్వడం జరిగింది, నెమిలి గ్రామ సర్పంచ్ సింగిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ MGNREGS నిధులు కేంద్రం విడుదల చేయడం జరిగింది దీనిలో భాగంగా నిధుల కేటాయింపులో నెమలి గ్రామానికి నిధులు కేటాయించకపోవడం బాధాకరం కేవలం బిజెపి సర్పంచ్ అయినందుకే ఉద్దేశపూర్వకంగా నిధులు కేటాయించలేదు దీని విషయంలో ఉన్నత అధికారులు తొందరగా స్పందించి నెమలి గ్రామానికి విధులు కేటాయించాలని కోరుతున్నాము.

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గం నసురుల్లాబాద్ మండలం నెమలి గ్రామ ప్రజలు ఓట్లు వేయలేదా మీ నిరంకుశ వైఖరి మానుకొని నిధులు కేటాయించాలని కోరుతున్నాము లేనియెడల పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇదే కక్ష సాధింపు కొనసాగిస్తే బాన్సువాడ నియోజకవర్గంలో ఎక్కడ కూడా తిరుగనీయకుండా అడ్డుకుంటామని బీజేపీ నాయకులు హెచ్చరిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో బాన్సువాడ టౌన్ ప్రెసిడెంట్ కోనాల గంగారెడ్డి, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ నసరుల్లాబాద్ మండల అధ్యక్షుడు చందూరి హనుమాన్లు, బిజెపి మున్సిపల్ కౌన్సిలర్ గజ్జల మహేష్ జిల్లా కౌన్సిలింగ్ నెంబర్ తృప్తి ప్రసాద్, మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు పైడిమాల్ లక్ష్మి నారాయణ మాజీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ బీజేపీ నాయకులు శ్యామల శ్రీకాంత్ మహేందర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
బాన్సువాడలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ నాయకుల నిరసన
బాన్సువాడలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ నాయకుల నిరసన

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్