గ్రామ సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి – కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Published on 31 Mar 2026, 07:20 AM 44
JH-77528
జనహితం న్యూస్, కామారెడ్డి: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణలో, ఏప్రిల్ 2న నిర్వహించనున్న గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ హాలులో జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ సభలు, వార్డు, మున్సిపల్ సభల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. గ్రామ సభలు, మున్సిపల్ సభలను పండుగ వాతావరణంలో నిర్వహించడంతో పాటు ప్రజలు, ప్రజా ప్రతినిధులు చురుకుగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గ్రామ సభల నిర్వహణపై నివేదికలను సిద్ధం చేసి గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించాలని, ప్రజా ప్రతినిధులకు ముందస్తుగా ఆహ్వానాలు పంపించాలని ఆదేశించారు. ఏర్పాట్లపై ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులు సమావేశాలు నిర్వహించి కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.
