హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
మహాలక్ష్మి పథకం విజయవంతంగా - ఉచిత ప్రయాణాలు 10,000 కోట్లు ఆదా JH-85254

జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం బాన్సువాడ బస్ స్టాండ్ లో బాన్సువాడ డిపో మేనేజర్ రవి కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు 290 కోట్ల ఉచిత ప్రయాణాలు 10,000 కోట్లు ఆదా చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా 2023 డిసెంబర్ 09 తేదీన ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో ఉచితంగా ప్రయాణించిన మహిళా ప్రయాణికులు సుమారుగా 290 కోట్లు కాగా ప్రయాణికులు ఆదా చేసుకున్న మొత్తం 10,000 కోట్ల రూపాయలు, అందులో బాన్సువాడ డిపో నుండి మహాలక్ష్మి పథకం ప్రారంభమయిన నుండి 30 మార్చి 2026 వరకు ఉచితంగా ప్రయాణించిన మహిళా ప్రయాణికులు 2.42 కోట్లు కాగా ప్రయాణికులు ఆదా చేసుకున్న మొత్తం రూపాయలు 90.32 కోట్లు రూ 10000 కోట్ల ప్రయాణ చార్జీలు ఆదా చేసుకున్న సందర్భంగా రాష్ట్ర మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు మహిళలను ఘనంగా సన్మానించిన పోచారం పాల్గొన్న బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, మహిళలు.

Click to join Whatsapp channel
Janahitham News
మహాలక్ష్మి పథకం విజయవంతంగా - ఉచిత ప్రయాణాలు 10,000 కోట్లు ఆదా
మహాలక్ష్మి పథకం విజయవంతంగా - ఉచిత ప్రయాణాలు 10,000 కోట్లు ఆదా

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్