హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
మేరా యువ భారత్ క్రీడలు ఘనంగా – కామారెడ్డిలో యువత ఉత్సాహం JH-64601

జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో నిర్వహించిన క్రీడ పోటీల్లో బాన్సువాడ, బిచ్కుంద, గాంధారి, ఎల్లారెడ్డి, నిజాంసాగర్ బ్లాక్ లో నుంచి క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా బాన్సువాడ పట్టణ సిఐ శ్రీధర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి చేతుల మీదుగా జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడ రంగంలో కూడా రాలించాలని క్రీడాలు. ఆడడం వల్ల మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వం పెరిగి ఆరోగ్యంగా ఉంటారని అదేవిధంగా ఇలాంటి పోటీల్లో రాణిస్తే రాష్ట్రస్థాయిలో కూడా రాణించగలరని మీలాంటి విద్యార్థులే ఎంతోమంది అంతర్జాతీయ ఒలంపిక్ లో రాణించారని వాళ్ళను స్ఫూర్తిదాయంగా తీసుకొని మీరు కూడా క్రీడారంగంలో రాణించాలని విద్యార్థులకు క్రీడాకారులకు సూచించారు.

క్రీడా పోటీలలో గెలుపు ఓటములు సహజమని వాటితో సంబంధం లేకుండా ఎలా గెలవాలి అనే తపన మీలో ఉంటే మీ సంకల్పం ఉంటే విజయం మీ సొంతం అవుతుందని తెలిపారు. అనంతరం ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మేరా యువ భారత్ జిల్లా అధికారి బెల్లాల్ శైలి, బాన్సువాడ రూరల్ సిఐ తిరుపతయ్య చేతుల మీదుగా వాలీబాల్ మొదటి బహుమతి నిజాంసాగర్ టీం, కబడ్డీ బాన్సువాడ టీం, చెస్ బిచ్కుంద మొదటి బహుమతి, పరుగు పందాల్లో బాన్సువాడ భరత్, మహిళ విభాగంలో పరుగు పందాల్లో తెరిస్సా, చదరంగం ఐశ్వర్య గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను ప్రశంస పత్రాన్ని ప్రధానం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా యూత్ ఆఫీసర్ బెల్లా శైలి మాట్లాడుతూ మేరా యువభారత్ భారతదేశంలో ఉన్న యువతకు మంచి సేవ భావాన్ని ఒక కొత్త యువనాయకత్వాన్ని తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దేశంలో ఉన్నటువంటి యువతకు ఎన్నో మంచి అవకాశాలను మై భారత్ కల్పిస్తుంది అందులో ముఖ్యమైనది నేషనల్ యూత్ ఫెస్టివల్ ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం యూత్ పార్లమెంట్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇలా ఎన్నో కార్యక్రమాలను నిర్వహించుకుంటూ యువతకు సన్మార్గంలో నడిపించడానికి భారత ప్రభుత్వం యూత్ మినిస్ట్రీ ఎంతో కృషి చేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మేనేజర్ కమిటీ మెంబర్ సునీల్ రాథోడ్ అలాగే పి ఈ టి తారాచంద్ సురేందర్ ప్రేమ్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
మేరా యువ భారత్ క్రీడలు ఘనంగా – కామారెడ్డిలో యువత ఉత్సాహం
మేరా యువ భారత్ క్రీడలు ఘనంగా – కామారెడ్డిలో యువత ఉత్సాహం

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్