70% పైగా పాస్… కానీ బాలికలే ముందంజ
Published on 12 Apr 2026, 05:37 PM 13
JH-29693
జనహితం న్యూస్, కామారెడ్డి: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడయ్యాయి. కామారెడ్డి జిల్లాలో వెల్లడైన ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు.
ఇంటర్ ఫస్టియర్లో...
జిల్లాలో ఇంటర్ ఫస్టియర్లో జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 4,89,123 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 3,23,807 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. 66.20 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ద్వితీయ సంవత్సరం 5,07,948 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఇందులో 3,58,490 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కాగా.. 70.58 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రథమ సంవత్సరంలో మొత్తం 2,49,110 మంది బాలికలు పరీక్షలు రాయగా 1,85,331 మంది పాసయ్యారు. 74.40 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక బాలురు 2,40,013 మంది పరీక్షలు రాయగా 1,38,475 మంది ఉత్తీర్ణులయ్యారు. 57.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
కామారెడ్డి ఇంటర్మీడియట్ ఫలితాలు సెకండియర్లో...
ద్వితీయ సంవత్సరంలో 2,54,050 మంది బాలికలు పరీక్షలు రాయగా 1,99,813 మంది ఉత్తీర్ణత సాధించారు. 78.65 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 2,53,898 మంది బాలురు పరీక్షలు రాయగా 1,58,677 మంది పాసయ్యారు. 62.50 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
