హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. లబ్ధిదారులకు ఊరట కల్పించిన ప్రభుత్వం JH-32352

జనహితం న్యూస్, కామారెడ్డి: నిజాంసాగర్ మండలంలోని పెద్ద ఆరేపల్లి గ్రామానికి చెందిన వేముల విట్టల్ మరియు బంజపల్లి గ్రామానికి చెందిన సమీర్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన చెక్కులను కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఈరోజు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపదలో ఉన్న ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తూ సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందించడం ఎంతో ఉపయుక్తమని పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి పథకాలను వినియోగించుకుని తమ సమస్యలను అధిగమించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు, ఉపసర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. లబ్ధిదారులకు ఊరట కల్పించిన ప్రభుత్వం
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. లబ్ధిదారులకు ఊరట కల్పించిన ప్రభుత్వం

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్