హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
ఉపాధ్యాయుల డిమాండ్లు పట్టించుకోకపోతే ఉద్యమం – ఎస్‌జీటీ హెచ్చరిక JH-63407

జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ స్థాయి ఎస్ జి టి ఉపాధ్యాయులు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా అయ్యాల సంతోష్ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సి పి ఎస్ రద్దు చేసి నూతన పెన్షన్ విధానాన్ని తీసుకువస్తామని, పి ఆర్ సి కూడా అమలులోకి తెస్తామని అన్నారు కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన కూడా లేదు, అన్ని ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. ఎస్ జి టి ఉపాధ్యాయుల సమస్యలను, ప్రాథమిక పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తూన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్ జి టి ఉపాధ్యాయులందరు గమనిస్తున్నారు.

ఎస్ ఎస్ సి స్పాట్ వాల్యూవేషన్ లో విధులు నిర్వహిoచబోయే ఎస్ జి టి ఉపాధ్యాయులకు సి సి ఎల్ మంజూరు చేయాలి. 2008 డీఎస్సీ నందు కాంట్రాక్టు టీచర్స్ గా ఎస్ జి టి లుగా నియామకం అయినా ఎస్ జి టి ఉపాధ్యాయులను 12 నెలల శాలరీ తో పాటు రెగ్యులర్ చేయాలి. ఎస్ జి టి ఉపాధ్యాయులు మరియు ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయుల సమస్యలు పరిష్కరించలేకపోతే మరి కొంత కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ జి టి ఉపాధ్యాయులందరు చైతన్యం అయి ప్రభుత్వం పై తిరుగుబాటు చేసే సమయం మరేంతో దూరం లేదని అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో బాన్స్వాడ మండల అధ్యక్షులు హీరాలాల్, ప్రధాన కార్యదర్శి పోతుగంటి వార్ హన్మాండ్లు, ఉపాధ్యక్షులు విజయ్ కుమార్, పండరి, సంజయ్, శ్రీకాంత్, కోశాధికారి శ్రీనివాస్ నాయక్, ఉమర్, ఫణిoద్ర, శ్యామ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
ఉపాధ్యాయుల డిమాండ్లు పట్టించుకోకపోతే ఉద్యమం – ఎస్‌జీటీ హెచ్చరిక
ఉపాధ్యాయుల డిమాండ్లు పట్టించుకోకపోతే ఉద్యమం – ఎస్‌జీటీ హెచ్చరిక

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్