హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
రేషన్ కార్డుల కోసం వేల రూపాయలు వసూలు?.. డీలర్‌పై గ్రామస్తుల ఫిర్యాదు JH-93297

జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలోని రేషన్ డీలర్ రేషన్ కార్డులు ఇప్పిస్తామని చెప్పి పేద ప్రజల నుండి ఒక్కొక్కరి వద్ద 5 వేల రూపాయల వరకు వసూలు చేశారని మంగళవారం సబ్ కలెక్టర్ కిరణ్మయికి గ్రామస్తులతో పాటు బిజెపి నాయకులు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని రేషన్ షాప్ నంబర్ 2901006 డీలర్ రేషన్ కార్డుల కొరకు ఐదువేల రూపాయలు వసూలు చేశారని సంబంధిత రెవిన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడితే తాము నిజాలు బయటపెడతామన్నారు. ఆ రేషన్ డీలర్ పై కఠిన చర్యలు తీసుకొని ఆ డీలర్ షిప్ ను రద్దు చేయాలని డబ్బులు ఇచ్చిన వారి డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది.

బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి స్పందిస్తూ వెంటనే విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, నాగరాజు రాజారెడ్డి, సంతోష్ తుకారాం సరిత దత్తు లక్ష్మణ్ రాజాసింగ్, బాధితులు తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
రేషన్ కార్డుల కోసం వేల రూపాయలు వసూలు?.. డీలర్‌పై గ్రామస్తుల ఫిర్యాదు
రేషన్ కార్డుల కోసం వేల రూపాయలు వసూలు?.. డీలర్‌పై గ్రామస్తుల ఫిర్యాదు

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్