పెద్ద హనుమాన్ మందిరంలో ఎమ్మెల్యే పోచారం పూజలు.. భక్తి సందడి
Published on 02 Apr 2026, 09:57 PM 15
JH-86164
జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని పెద్ద హనుమాన్ మందిరంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సోమేశ్వర్ గ్రామంలో..బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న ఆంజనేయ స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా కొనసాగింది.
కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మహోత్సవంలో భాగంగా వినాయక స్వామి, శివలింగం, నందివాహనం, ధ్వజస్తంభం, శిఖర స్థిర ప్రతిష్ఠాపన వంటి పుణ్యకార్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆలయ ధర్మకర్త పోచారం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థులు, భక్తులు భారీగా హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. ఇటువంటి పున:ప్రతిష్ఠాపన కార్యక్రమాలు గ్రామాభివృద్ధికి, ఆధ్యాత్మిక చైతన్యానికి దోహదపడతాయన్నారు.
