హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
సలాబత్‌పూర్ ఆలయంలో ఘన పూజలు.. డిసిసి అధ్యక్షుడికి సన్మానం JH-89043

జనహితం న్యూస్, కామారెడ్డి: జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండల కేంద్రంలోని సలాబత్ పుర్ ప్రసిద్ధ హనుమాన్ దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్ ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరైన ఆయన, భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ ప్రాంత ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థించారు భక్తులతో కలసి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆయన హాజరు కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకువచ్చి, భక్తుల్లో ఉత్సాహాన్ని నింపింది.

సన్మానంతో గౌరవించిన ఆలయ పురోహితులు…పూజా కార్యక్రమం అనంతరం ఆలయ పురోహితులు మరియు కమిటీ సభ్యులు డిసిసి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ శాలువాతో ఘనంగా సన్మానించి ఆయన సేవలను కొనియాడారు. ప్రజల కోసం ఆయన చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ ఆశీస్సులు అందించారు. అనంతరం అన్నప్రసాదం వంట కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొని సేవా భావాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా, మొత్తం వేడుకలు భక్తి భావంతో ఎంతో ఘనంగా కొనసాగాయి.

Click to join Whatsapp channel
Janahitham News
సలాబత్‌పూర్ ఆలయంలో ఘన పూజలు.. డిసిసి అధ్యక్షుడికి సన్మానం
సలాబత్‌పూర్ ఆలయంలో ఘన పూజలు.. డిసిసి అధ్యక్షుడికి సన్మానం

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్