మాజీ సర్పంచ్ కుటుంబానికి ₹12 లక్షల బీమా.. భావోద్వేగ క్షణాలు
Published on 18 Apr 2026, 04:08 PM 70
JH-44604
జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని మర్కల్ గ్రామ మాజీ సర్పంచ్ జూకంటి సంగారెడ్డి కుటుంబానికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో 12 లక్షల రూపాయల బీమా చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమానికి సదాశివనగర్ ఎస్సై పుష్పరాజ్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ డీజీఎం సురేష్, డి ఎం శ్రీనివాస్, కామారెడ్డి బ్రాంచ్ మేనేజర్ తిరుపతి చౌహన్ హాజరై వారి చేతుల మీదుగా 12 లక్షల రూపాయల బీమా చెక్కులను సంగారెడ్డి సతీమణి నాగలక్ష్మి కి అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్సై పుష్పరాజ్ మాట్లాడుతూ ప్రమాదాలు అనుకోకుండా జరుగుతాయని, ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండటంతో పాటు ఇన్సూరెన్స్ తప్పకుండా చేయించుకోవాలని సూచించారు. డీజీఎం సురేష్, డి ఎం శ్రీనివాస్,బ్రాంచ్ మేనేజర్ తిరుపతి చౌహన్ మాట్లాడుతూ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయవద్దని తెలిపారు. మన భద్రత మన బాధ్యతగా, కుటుంబానికి రక్షణగా నిలవాలని తెలియజేశారు. అంతకుముందు సంగారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుంట ప్రియాంక, సుభాష్ రెడ్డి, ఉప సర్పంచ్ గుర్రపు లింగం,కార్యదర్శ ఇతరులు పాల్గొన్నారు.
