అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు పూలే
Published on 11 Apr 2026, 12:31 PM 80
JH-29785
జనహితం న్యూస్, మెదక్ రూరల్: మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున గౌడ్ ఆధ్వర్యంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున గౌడ్ కొనియాడారు. శనివారం మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... జ్యోతిబా ఫూలే చూపిన మార్గంలో నడుస్తూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు సమాన న్యాయం అందాలంటే సామాజిక న్యాయం ద్వారానే సాధ్యమని నమ్మి, ఆ దిశగా పోరాడిన మహనీయుడు ఫూలే అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు బట్టి జగపతి, అకిరెడ్డి కృష్ణారెడ్డి, న్యాయవాది జీవన్ రావు, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు, కోకన్వీనర్ లు కిష్టా గౌడ్, లింగారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు దీపక్ కుమార్, గౌస్, పార్టీ నాయకులు సురేందర్ గౌడ్, మాయ మల్లేశం, ఆర్కే. శ్రీనివాస్, కిషోర్ కుమార్, చంద్రశేఖర్ గౌడ్, గట్టేష్, ఇస్మాయిల్, సునీల్, సంతోష్, సాయి కుమార్, అస్రగల్ల బాలరాజు, నరేందర్, శంకర్, నవీన్, కనక చారి, కిరణ్, స్వామి నాయక్, ఎంబిపూర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
