ఉమ్మడి మెదక్ జిల్లా సీనియర్ నేతలతో (నిజనిర్ధారణ) విచారణ కమిటీ
Published on 10 Apr 2026, 10:30 PM 101
JH-65531
జనహితం న్యూస్, మెదక్ రూరల్: మెదక్ జిల్లా, వెల్దుర్తి మండలం, మంగళపర్తి గ్రామానికి సంబంధించిన డోలు సాయిలు కుటుంబ సభ్యులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ అన్నని తమ భూమికి సంబంధించిన విషయంలో అన్యాయం జరిగిందని మందకృష్ణ మాదిగను కలవడం జరిగింది. వారికి రావలసిన వారసత్వ భూమి రాకుండా చేస్తున్నారు. మాకు న్యాయం చేయాలని మందకృష్ణ మాదిగ ను కలిశారు.
ఈ విషయాన్ని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డికి సంబంధించిన సీనియర్ నేతలు పరిశీలించి వారికి తగు న్యాయం చేయాలని మందకృష్ణ మాదిగ ను సూచించారు. మా భూమిని దొంగ కాగితాలు సృష్టించి భూమి లాక్కోవాలని చూస్తున్న స్థానిక సర్పంచ్ రామ్ కిషన్ రావుకి అండగా మా కుటుంబ సభ్యులైన ఒకరు వారికి అండగా నిలబడి మాకు రావలసిన భూమిని రాకుండా చేస్తున్నారు అని హైదరాబాద్ లోని మందకృష్ణ మాదిగ నివాసంలో కలిసి తమ ఆవేదాన్ని వివరించారు. ఈ విషయంపై ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకత్వం వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామాన్ని సందర్శించి జరిగిన సంఘటనపై నిజనిర్ధారణ చేసి న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు బాధితులకు న్యాయం చేసే విధంగా ఉండాలని మందకృష్ణ మాదిగ ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా సమాచారం ఇచ్చారు. తేదీ 7 /4 /2026 నాడు మధ్యాహ్నం ఆ గ్రామానికి వెళ్లి సాయిలు కుటుంబాన్ని కలిసి పూర్తి సమాచారం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో సర్వేనెంబర్ 401 గల భూమిలో బలవంతంగా లాక్కోవడానికి సర్పంచ్ ప్రయత్నిస్తున్నాడని నిజ నిర్ధారణ లో తేలింది.
ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకులు మాసాయిపేట యాదగిరి మాదిగ, లింగంపల్లి శ్రీనివాస్ మాదిగ, ఉషన్నగళ్ళ మురళి మాదిగలు, సీనియర్ నాయకుల సమక్షంలో నిజ నిర్ధారణ చేయడం జరిగింది. సాయిలు కుటుంబానికి న్యాయం కోసం మెదక్ జిల్లా కలెక్టర్ ని మరియు ఆ కుటుంబానికి ప్రాణహాని ఉన్నందున జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మహనీయుల జయంతి కార్యక్రమం ఉన్నందున పూర్తి రిపోర్టును తయారుచేసి బాధితులకు న్యాయం జరిగే విధంగా మెదక్ జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు బాధితులకు అండగా ఉంటామని తెలిపారు.
