సర్దన గ్రామ సభ.. అభివృద్ధిపై కీలక నిర్ణయాలు
Published on 02 Apr 2026, 11:07 PM 17
JH-42779
జనహితం న్యూస్, మెదక్ రూరల్: మెదక్ జిల్లా హవేలీ ఘనాపూర్ మండలంలోని సర్దన గ్రామంలో గురువారం రోజున గ్రామసభ నిర్వహించడం జరిగింది ఈ యొక్క గ్రామసభలో గ్రామం సర్పంచ్ వినోద సతీష్ మాట్లాడుతూ... గ్రామంలోని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని అలాగే ఇప్పటివరకు పింఛన్ రానివారు పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలని అలాగే సిసి రోడ్లు గ్రామంలో ఎక్కడ లేని చోట సీసీ రోడ్డు వెయ్యాలని మరియు 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలని మరియు గ్రామంలోని ప్రతి ఒక్కరూ గ్రామ అభివృద్ధికి సహకరించాలని సర్జన గ్రామ సర్పంచ్ ఎనిమిది వినోద సతీష్, మరియు ఉప సర్పంచ్ అలాగే వార్డు మెంబర్లు ఆశ వర్కర్ ఏఎన్ఎం అంగన్వాడి టీచర్లు గ్రామ ప్రజలు పెద్దలు యువకులు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
