హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
షమ్నాపూర్ గ్రామసభ.. పింఛన్లు, ఇండ్లపై కీలక నిర్ణయాలు JH-61091

జనహితం న్యూస్, మెదక్ రూరల్: మెదక్ జిల్లా హవేలీ ఘణపూర్ మండలం షమ్నాపూర్ గ్రామంలో గ్రామసభ షమ్నాపూర్ సర్పంచ్ పట్నం నాగరాణి మరియు పంచాయతీ కార్యదర్శి డాక్టర్ యాదగిరి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభ సమావేశంలో ఇప్పటివరకు వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఇప్పటివరకు పింఛన్లు రానివారికి పెన్షన్ల కోసం దరఖాస్తు తీసుకోవడం జరిగింది అనంతరం గ్రామంలో సిసి రోడ్లు వేయాలని గ్రామసభలో తీర్మానించడం జరిగింది. అలాగే ఇందిరమ్మ ఇండ్ల విషయంలో పూరి గుడిసెలు ఉన్న లబ్ధిదారులకు మాత్రమే రెండవ విడుదల వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని తీర్మానం చేయడం జరిగింది మరియు గ్రామాన్ని అభివృద్ధి చేసే విషయంలో అందరూ సహకరించాలని షమ్నాపూర్ గ్రామ సర్పంచ్ పట్నం నాగరాణి తెలిపారు.

పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రామసభలో గ్రామం ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పట్నం నాగరాణి పంచాయతీ కార్యదర్శి డాక్టర్ యాదగిరి స్పెషల్ ఆఫీసర్ మరియు ఉప సర్పంచ్ అనిల్ మరియు వార్డు మెంబర్లు అంగన్వాడి టీచర్లు గ్రామపంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
షమ్నాపూర్ గ్రామసభ.. పింఛన్లు, ఇండ్లపై కీలక నిర్ణయాలు
షమ్నాపూర్ గ్రామసభ.. పింఛన్లు, ఇండ్లపై కీలక నిర్ణయాలు

→ మల్లీశెట్టి రవి - రిపోర్టర్‌