హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
వడదెబ్బతో మృతి.. కుటుంబాలకు అండగా డా. హకీమ్ సహాయం JH-55804

జనహితం న్యూస్, పోతంగల్: నిరుపేద ప్రజలకు సేవ చేయడమే నా జీవిత లక్ష్యమని,పేదలకు తోచిన విధంగా సహాయం చేస్తేనే ఎల్లప్పుడూ జీవితంలో గుర్తు ఉంటుందని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, సామాజిక సేవ మూర్తి,డాక్టర్ ఎంఏ హకీమ్ అన్నారు. శనివారం పోతంగల్ మండల కేంద్రం లో ఆయన విస్తృతంగా పర్యటించి ఇటీవల వడదెబ్బతో మృతి చెందిన రసూల్, సిరిగంధం లాలయ్య కుటుంబాలకు పలకరించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా డా.ఎంఏ హకీమ్ మాట్లాడుతూ వేసవి కాల దృశ్య మండు టెండలలో బీదవారు కడుపు తిప్పల కొరకు ఎంతో శ్రమించి ఎండతీవ్రతకు మృత్యువాత గావించడం విచారించ దగ్గ విషయమని ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు. రోజురోజుకు ఎండ తాపం పెరుగుతున్న తరణంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు వహించాలన్నారు. ఆపదలో ఉన్న వారికి తోచిన విధంగా సహాయ సహకారాలు అందించడం తనకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుందని గుర్తు చేశారు. ఆయన వెంట సుదం నవీన్, పబ్బ శేఖర్, పోశట్టి, మృతుని కుటుంబ సభ్యులు, తదితరులు ఉన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
వడదెబ్బతో మృతి.. కుటుంబాలకు అండగా డా. హకీమ్ సహాయం
వడదెబ్బతో మృతి.. కుటుంబాలకు అండగా డా. హకీమ్ సహాయం

→ పుప్పల వినోద్ కుమార్ - రిపోర్టర్