చిన్న రైతులపై వివక్ష?.. రుద్రూర్ సొసైటీపై తీవ్ర ఆరోపణలు
Published on 18 Apr 2026, 12:33 AM 6
JH-37434
జనహితం న్యూస్, రుద్రూర్: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని చిన్న సన్నకారు రైతులకు రుద్రూరు సొసైటీ సెక్రటరీ తో పాటు అధికారులు రైతులకు శాపంగా మారుతున్నారని తమ గోడును రైతులు మీడియాకు విన్నవించారు.
ఈ సందర్భంగా ఆరబోసిన ధాన్యం రైతులు అదే సొసైటీ ఎదుట పోసి నిరసన చేసి తమ బాధను వెల్లడించారు.రైతులు మాట్లాడుతూ గత 15 రోజుల క్రితం వడగండ్ల వర్షం భారీ వర్షం కురవడంతో తమ పంట పూర్తిగా నష్టపోయిందని 40 సంచులకు గాను కేవలం 20 సంచులు మాత్రమే వచ్చాయని వచ్చిన ధాన్యం కూడా ఆరబోసి 15 రోజులు అవుతున్న సెక్రటరీ మాత్రం పట్టించుకోవడంలేదని వాపోయారు.
అధికారుల చుట్టూ సుమారు 15 రోజుల నుంచి తిరుగుతున్న పట్టించుకోవడం లేదన్నారు. ఆరబోసిన ధాన్యం తీసుకోవడంలో కాలయాపన చేస్తున్నారని చిన్న సన్న రైతుల పట్ల పూర్తిగా వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. పెద్ద రైతుల ధాన్యం తీసుకుంటున్నారు తప్ప చిన్న సన్న రైతుల ధాన్యం తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.
చిన్న రైతుల పట్ల రుద్రూర్ సొసైటీ సెక్రటరీ తో పాటు ఇతరులు వివక్ష చూపుతున్నారని వీరి నిర్లక్ష్యంపై జిల్లా స్థాయి అధికారులు జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టిపెట్టి చిన్న సన్న రైతులకు న్యాయం చేయాలని కోరారు.
