హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
బడాపహాడ్ యాత్రికుల బస్సు బోల్తా.. 8 మందికి తీవ్ర గాయాలు JH-80570

జనహితం న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో బడాపహాడ్ బస్ బోల్తా యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటన వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని బడాపహాడ్ శివారులో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పటాన్ చెరు ప్రాంతానికి చెందిన.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్ చెరు ప్రాంతానికి చెందిన యాత్రికులు ఒక ప్రైవేట్ స్కూల్ బస్సులో బడాపహాడ్ పుణ్యక్షేత్రానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో బడాపహాడ్ సమీపంలోని అటవీ ప్రాంతంలో మూలమలుపు వద్ద డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో బోల్తాపడింది. ప్రమాదం తెల్లవారుజామున జరిగింది.

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది యాత్రికులు ఉన్నారు. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని వెంటనే నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Click to join Whatsapp channel
Janahitham News
బడాపహాడ్ యాత్రికుల బస్సు బోల్తా.. 8 మందికి తీవ్ర గాయాలు
బడాపహాడ్ యాత్రికుల బస్సు బోల్తా.. 8 మందికి తీవ్ర గాయాలు

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్