హంగర్గలో అంబేద్కర్ జయంతి సందడి… సర్పంచ్ ఉదయ్ భాస్కర్ ఆధ్వర్యంలో కార్యక్రమం
Published on 14 Apr 2026, 12:53 PM 123
JH-87141
జనహితం న్యూస్, బాన్సువాడ: బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండలం హంగర్గ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఈరోజు గ్రామ సర్పంచ్ ఉదయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలో అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు హాజరై అంబేద్కర్ సేవలను గుర్తుచేసుకున్నారు.
సర్పంచ్ ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ, “అంబేద్కర్ చూపిన మార్గం ఇప్పటికీ సమాజానికి అవసరం. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలు పాటించాలి” అని అన్నారు.
👉 Read Also
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దుర్కి గోపీ, వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలో కొంతసేపు ఉత్సాహంగా వాతావరణం కనిపించింది.
