హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
పిల్లల ఆరోగ్యం ప్రమాదంలోనా?.. ప్యాకెట్ ఫుడ్‌పై సర్పంచ్ హెచ్చరిక JH-35503

జనహితం న్యూస్, నిజామాబాద్ : బాన్సువాడ నియోజకవర్గంలోని పోతంగల్ మండలం హంగర్గ గ్రామంలో పిల్లల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నీరడి ఉదయ్ భాస్కర్ పిల్లల ఆహారపు అలవాట్లపై ముఖ్య సూచనలు చేశారు.

పిల్లలు కుర్కురే, ఐస్‌క్రీమ్స్, కూల్‌డ్రింక్స్ వంటి ప్యాకెట్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఆహారం అధికంగా తీసుకోవడం వల్ల పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

“పిల్లల ఆరోగ్యం ప్రతి కుటుంబానికి అత్యంత ముఖ్యమైనది. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండి, ఇంట్లో సహజంగా తయారు చేసిన ఆహారం పిల్లలకు ఇవ్వడం ఉత్తమం” అని సర్పంచ్ సూచించారు.

గ్రామంలో ఆరోగ్యంపై అవగాహన పెంచడం లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ గంగారం, ఉప సర్పంచ్ దుర్కి గోపాల్, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
పిల్లల ఆరోగ్యం ప్రమాదంలోనా?.. ప్యాకెట్ ఫుడ్‌పై సర్పంచ్ హెచ్చరిక
పిల్లల ఆరోగ్యం ప్రమాదంలోనా?.. ప్యాకెట్ ఫుడ్‌పై సర్పంచ్ హెచ్చరిక

→ గోనె సాయిలు - ఎడిటర్‌ / సీనియర్ రిపోర్టర్