హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
వైద్యులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి: నార్ల రత్నకుమార్ JH-43329

జనహితం న్యూస్, నిజామాబాద్: నిర్మల్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ సంతోష్ కుమార్ గుప్తాపై ఇటీవల జరిగిన భౌతిక దాడి ఘటనపై తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ చీఫ్ ఆర్గనైజర్, నిజామాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు నార్ల రత్న కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండిస్తూ, వైద్యులపై దాడులు చేయడం అనాగరిక చర్యగా అభి వర్ణించారు.

ఈ సందర్భంగా నార్ల రత్న కుమార్ మాట్లాడుతూ, "వైద్య వృత్తి అనేది అత్యంత పవిత్ర మైనది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను కాపాడేందుకు అహర్ని శలు కష్టపడే వైద్యులు సమాజంలో దైవసమానులు అలాంటి వారిపై భౌతిక దాడులు చేయడం, అసభ్య పద జాలంతో దూషించడం పూర్తిగా అంగీకరించలేని విషయం" అని పేర్కొన్నారు. డాక్టర్ సంతోష్ కుమార్ గుప్తా వంటి నిబద్ధత కలిగిన వైద్యు లపై దాడి జరగడం చాలా బాధా కరమని, ఇటు వంటి ఘటనలు వైద్య రంగంపై ప్రజల్లో భయాందో ళనలు కలిగిస్తాయని ఆయన అన్నారు. వైద్యులు నిర్భయంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం భద్రతా చర్యలను మరింత కట్టు దిట్టం చేయాలని సూచించారు.

ఈ దాడికి పాల్పడిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి, చట్ట పరమైన కఠిన చర్యలు తీసు కోవాలని నార్ల రత్నకుమార్ డిమాండ్ చేశారు. భవిష్యత్తు లో ఇలాంటి ఘటనలు పున రావృతం కాకుండా ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయా లని ఆయనకోరారు. అంతేకాకుండా, సమాజంలోని ప్రతి వ్యక్తి వైద్యులను గౌర వించడం, వారి సేవలను గుర్తించడం అత్యంత అవసరమని, సమస్యలు ఉంటే చట్టబద్ధ మార్గాల్లో పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

Click to join Whatsapp channel
Janahitham News
వైద్యులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి: నార్ల రత్నకుమార్
వైద్యులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి: నార్ల రత్నకుమార్

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్