హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
ఫ్లాష్: తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.. మేలో పోలింగ్‌కు సిద్ధమా? JH-31750

జనహితం న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందడి కనిపించబోతోంది. మే నెలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అధికారులను అప్రమత్తం చేసింది. ఓటర్ల జాబితాను త్వరితగతిన సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 23లోపు ముసాయిదా ఓటర్ల జాబితాను తయారు చేసి ప్రచురించాలని అధికారులకు సూచించింది.

రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అధికార యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టగా, రాజకీయ పార్టీల్లోనూ కదలికలు పెరుగుతున్నాయి.

అయితే, ఎన్నికల తేదీలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Click to join Whatsapp channel
Janahitham News
ఫ్లాష్: తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.. మేలో పోలింగ్‌కు సిద్ధమా?
ఫ్లాష్: తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.. మేలో పోలింగ్‌కు సిద్ధమా?

→ పుప్పల వినోద్ కుమార్ - రిపోర్టర్