ఘనంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు
Published on 20 Apr 2026, 05:18 PM 72
JH-94727
జనహితం న్యూస్, పోలవరం నియోజకవర్గం: క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. పోలవరం నియోజకవర్గంలోని బరింకలపాడు గ్రామంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను కూటమి నాయకుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ పంచుకొని సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకుడని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. సాంకేతికతను వినియోగిస్తూ పరిపాలనలో పారదర్శకత తీసుకురావడం, పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అంశాల్లో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
అలాగే పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు నేరుగా చేరుతున్నాయని, గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, విద్యా మరియు వైద్య రంగాల్లో చేపడుతున్న చర్యలు రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాయని తెలిపారు.
పోలవరం నియోజకవర్గ అభివృద్ధికి కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, అనేక అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నాలి శ్రీనివాస్, గుడెల్లి లక్ష్మీనారాయణ, తమ్మన సాంబశివరావు, పానుగంటి శ్రీనివాస్, బండారు అనిల్ కుమార్, సిరిబత్తుల మధు, సిరిబత్తుల స్వామి, మందపాటి సూర్యచంద్రం, తమ్మన నాగేశ్వరరావు, రవి, దుర్గాప్రసాద్ తదితరులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
