ఘనంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు
Published on 20 Apr 2026, 05:10 PM 69
JH-75442
జనహితం న్యూస్, టీ నర్సాపురం: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకునిరాష్ట్ర కార్యదర్శి తోట లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో తిరుమలదేవీపేట వేడుకలు ఘనంగా నిర్వహించారు
స్వరమత ప్రార్ధనలు : తిరుమలదేవీపేట ఆంజనేయ స్వామి గుడి వద్ద ముఖ్యమంత్రి గారి ఆయురారోగ్యాలతో ఉండాలి అని పూజ చేయిచడం జరిగింది అదే విధంగా చర్చ్ నందు కూడా అయన ఆయురారోగ్యాలతో ఉండాలి అని పార్ధనలు చేయించడం జరిగింది.
అనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76 వ పుట్టినరోజు సందర్బంగా 76 పండ్ల మొక్కలతో" HBD CBN" రాసి, హైస్కూల్, పబ్లిక్ స్థలలలో 76 మొక్కలను నాట్టి ఆయనకి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. సేవ కార్యక్రమంలు తిరుమలదేవీపేట లో గల ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది
కేక్ కటింగ్: రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి తోట లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తిరుమలదేవిపేట తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ మధ్యాహ్నపు సురేష్, రెబ్బ ధర్మారావు ప్రధాన కార్యదర్శి , యూత్ లీడర్ తోట వీర స్వామి నాయుడు, శ్రీను, తెలుగుదేశం వైస్ ప్రెసిడెంట్ మన్యం దుర్గరావు, కాసగాని వీరాజు, పండు, సీనియర్ నాయకులు యాగంటి వెంకటరావు, సత్యనారాయణ, వీరబాబు, నాగరాజు, అంజి, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి తోట లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసే చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్ర అభివృద్ధి ఆయనతోనే సాధ్యమని ఆకాంక్షించారు.
