వేసవి సెలవుల్లో విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా అవగాహన సదస్సులు నిర్వహించాలి
Published on 20 Apr 2026, 04:58 PM 67
JH-93236
జనహితం న్యూస్, టీ నర్సాపురం: ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం ఎంపీడీవో జి మణికుమారి గారికి, మండల విద్యాశాఖ అధికారి తేజావత్ రామ్మూర్తి గారికి వినతి పత్రాలు అందజేసిన సామాజిక కార్యకర్త కొరివి నాగేశ్వరరావు కొరివి రమేష్ వేసవి సెలవులలో విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా అవగాహన సదస్సులు కార్యక్రమాలు నిర్వహించాలనీ కోరుతూ టీ నర్సాపురం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్తలు సోమవారం నాడు మండల ప్రజా పరిషత్ లో జరిగిన పి జి ఆర్ ఎస్ ద్వారా మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిణి జి మణి కుమారి గారికి, మండల విద్యాశాఖ అధికారి తేజ రామ్మూర్తి గారికి వినతి పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త కొరివి నాగేశ్వరరావు మాట్లాడుతూ, మరో రెండు మూడు రోజులలో విద్యార్థులకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించనుందనీ, వేసవి సెలవులలో రాష్ట్రంలో చిన్నారులు చెరువులలో నదులలో కుంటలలో తోటి విద్యార్థులతో స్నేహితులతో సరదాగా ఈతకు వెళ్లి అనేకమంది తమ నిండు ప్రాణాలు కోల్పోయి కన్న వారికి కూడా కడుపు కోత మిగిల్చిన సంఘటనలు తెలుగు రాష్ట్రాలలో అనేకం జరిగాయని తాజాగా జరుగుతున్నాయని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి మరియు మైనర్లు వాహనాలు నడపకుండా ఇతర ప్రమాదాల పట్ల కూడా విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో మండల ప్రజా పరిషత్ అధికారులు, విద్యాశాఖ, ఇరిగేషన్ మరియు పోలీసులు సమన్వయంతో "విద్యార్థులు - ప్రమాదాల నివారణ" అనే అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలనీ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో గండిగూడెం గ్రామస్తులు కొరివి రమేష్,కొరివి సుమంత్ తదితరులు పాల్గొన్నారు.
