హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
ఇంటర్‌లో టాప్ మార్కులు.. గ్రామం గర్వపడేలా చేసిన విద్యార్థినులు JH-36977

టీ నర్సాపురం, (జనహితం న్యూస్): టీ నర్సాపురం మండల ప్రజా పరిషత్ హై స్కూల్ ప్లస్ లో ఇంటర్మీడియట్ లో ప్రతిభ కనబరచి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులు  కొక్కొండ రోషిత (తల్లిదండ్రులు సూరిబాబు సరోజిని గండిగూడెం), MPC విభాగంలో 1000/983, సాధించి ప్రథమ స్థానంలో నిలవగా ద్వితీయ స్థానంలో ఇందిరా కాలనీకి చెందిన పసుపులేటి హేమావతి (తల్లిదండ్రులు దుర్గారావు, నాగలక్ష్మి) బైపీసీలో 1000/965, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 455/ 406 మార్కులు సాధించిన టీ నర్సాపురం నకు చెందిన సయ్యద్ ఆరిషా (తల్లిదండ్రులు అబ్దుల్లా, పర్వీన్) లను సామాజిక కార్యకర్తలు యస్ డి నా సర్ పాషా, కొరివి శేషారావు, కొరివి నాగేశ్వరరావు, పింగుల మధు, వారి ఇంటి వద్దనే కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

వారు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరాలని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు, స్వీట్లు అందజేసి విద్యార్థులను ఎంతగానో ప్రోత్సహించారు, ప్రైవేటు కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కాలేజీల్లో కూడా చక్కని ఫలితాలు రావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ బ్రాంచీలో 570/560 మార్కులు సాధించి తమ ప్రతిభను చాటిన టీ నర్సాపురం గ్రామానికి చెందిన మండం రేఖాంబిక (తల్లిదండ్రులు ఆదిత్య, పుష్ప మాధవి) ను కూడా వారి ఇంటి వద్ద కలిసి స్వీట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కొకొండ భూషణాచారి, మల్లయ్య, షమ్మీకపూర్, తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
ఇంటర్‌లో టాప్ మార్కులు.. గ్రామం గర్వపడేలా చేసిన విద్యార్థినులు
ఇంటర్‌లో టాప్ మార్కులు.. గ్రామం గర్వపడేలా చేసిన విద్యార్థినులు

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్