సందిగ్ధంలో అజారుద్దీన్ మంత్రి పదవి
Published on 30 Mar 2026, 05:36 PM 59
JH-30607
జనహితం న్యూస్: ఏప్రిల్ 30వ తేదీన ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే పదవి పొందాలనే గడువు ముగుస్తుండడంతో అయోమయంలో అజారుద్దీన్.
ఇటీవల హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు తెలపడంతో, హైకోర్టుకు వెళ్తే మరో 3, 4 నెలలు ఆలస్యం అవుతుందని ఆందోళన దీంతో గడువు ముగిసేలోపు అజారుద్దీన్ మంత్రి పదవికి రాజీనామా చేయించి, మే 16వ తేదీ అనంతరం జరిగే కేబినెట్ విస్తరణలో అవకాశం కల్పించాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి.
కానీ మే 16వ తేదీలోపు గవర్నర్ అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవికి ఆమోదం తెలుపుతారా లేదా అనే అంశంపై కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న చర్చలు హెచ్సీఏలో జరిగిన రూ 20 కోట్ల అవకతవకల వల్ల అజారుద్దీన్ ప్రెసిడెంట్ పదవి నుండి తప్పుకోవాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని గవర్నర్ అభ్యంతరం తెలుపుతాడని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
ఇదే జరిగితే మే నెలలోనూ అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కడం కష్టమేనని సమాచారం. అయితే నవంబర్ 14వ తేదీన పలువురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగుస్తుండటంతో, వారి స్థానంలో అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా నియమించాలని ప్రభుత్వం ఆలోచన.
గవర్నర్ ఆమోదం, హెచ్సీఏ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు లాంటి అంశాలతో అజారుద్దీన్‌ను జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం పావుగా వాడుకున్నారని మైనార్టీ సంఘాల్లో జోరుగా చర్చలు
