హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
మైదానంలో మల్లన్న దూకుడు – బెస్ట్ ప్లేయర్ అవార్డు JH-20974

జనహితం న్యూస్: ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన రెండవ రోజు క్రీడా పోటీల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు అపూర్వ ప్రతిభ కనబరిచి అందరి ప్రశంసలు అందుకున్నారు. రాజకీయ రంగంలోనే కాదు, క్రీడా రంగంలో కూడా తన దూకుడు, క్రమశిక్షణ, పట్టుదలతో మల్లన్న గారు ప్రత్యేక గుర్తింపు సాధించారు.

అనేక క్రీడల్లో మొదటి స్థానాల్లో విజయం. మల్లన్న గారు పాల్గొన్న ప్రతి క్రీడలోనూ అద్భుత ప్రదర్శన చేస్తూ పలు విభాగాల్లో విజేతగా నిలిచారు:

  1. ఫుట్‌బాల్ – 1వ స్థానం 
  2. వాలీబాల్ – 1వ స్థానం 
  3. 100 మీటర్ల రన్నింగ్ – 1వ స్థానం 
  4. షాట్‌పుట్ – 1వ స్థానం 
  5. జావెలిన్ త్రో – 1వ స్థానం అద్భుతమైన ప్రదర్శన చేసి 1వ స్థానంలో నిల్చారు 
  6. కబడ్డీ – 2వ స్థానం ఉన్నారు 
  7. ఆర్చరీ – 2వ స్థానం ఉన్నారు 
  8. క్రికెట్ – 2వ స్థానం కొనసాగారు 
  9. బ్యాడ్మింటన్ – 3వ స్థానం ఉన్నారు 
  10. 100 మీటర్ వాకింగ్ - 3వ స్థానం ఉన్నారు 

బెస్ట్ ప్లేయర్ అవార్డు

ఈ పోటీల్లో మొత్తం ప్రదర్శన ఆధారంగా అందరికంటే ముందంజలో నిలిచిన మల్లన్న గారికి “బెస్ట్ ప్లేయర్ అవార్డు” కూడా దక్కడం విశేషం. ఇది ఆయన క్రీడా నైపుణ్యానికి, అంకితభావానికి నిదర్శనం.

ప్రతి ఆటలో ప్రతిభ – ప్రేక్షకులను అలరించిన మల్లన్న

క్రికెట్‌లో అద్భుతమైన బ్యాటింగ్, కచ్చితమైన బౌలింగ్‌తో అభిమానులను అలరించిన మల్లన్న గారు, ఫుట్‌బాల్ మరియు వాలీబాల్‌లో చురుకైన ఆటతీరు ప్రదర్శించారు. కబడ్డీ, బ్యాడ్మింటన్, ఆర్చరీ వంటి విభిన్న క్రీడల్లో కూడా సమాన ప్రతిభ కనబరచడం ఆయన బహుముఖ నైపుణ్యాన్ని స్పష్టంగా చూపించింది.

క్రీడా స్ఫూర్తి – నాయకత్వానికి ప్రతిబింబం 

ఈ సందర్భంగా మల్లన్న గారు మాట్లాడుతూ, క్రీడలు మనలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం, క్రమశిక్షణ, జట్టు భావనను పెంపొందిస్తాయని తెలిపారు. ప్రజా ప్రతినిధులు కూడా క్రీడలను ప్రోత్సహిస్తూ ఆరోగ్యకర జీవన విధానానికి మార్గదర్శకులుగా నిలవాలని సూచించారు.

Click to join Whatsapp channel
Janahitham News
మైదానంలో మల్లన్న దూకుడు – బెస్ట్ ప్లేయర్ అవార్డు
మైదానంలో మల్లన్న దూకుడు – బెస్ట్ ప్లేయర్ అవార్డు

→ గోనె సాయిలు - ఎడిటర్‌ / సీనియర్ రిపోర్టర్