మాదిగలు, ఉపకులాలు ఐక్యంగా ఉండాలి.. సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేద్దాం: కడియం శ్రీహరి
Published on 22 Mar 2026, 06:06 PM 59
JH-80930
జనహితం న్యూస్ హైదరాబాద్ : మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారిని మాదిగ, మాదిగ ఉప కులాల కో ఆర్డినేషన్ సమితి చైర్మన్ ప్రొఫెసర్ ఖాసీం, కో ఆర్డినేషన్ సమితి సభ్యులు హైదరాబాద్ లోని ఎమ్మెల్యే గారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు..
ఈ సందర్బంగా మాదిగ, మాదిగ ఉప కులాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే గారు కో ఆర్డినేషన్ సభ్యులతో చర్చించారు. ఇటీవల మాదిగ ఉద్యోగుల కో ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్యమంత్రి గారి ఆత్మీయ సన్మాన సభ విజవంతం కావడం పట్ల అభినందనలు తెలిపారు. మాదిగ, మాదిగ ఉప కులాలు ఐక్యంగా ఉండలాని సూచించారు. రానున్న రోజులలో మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అందరం కలిసి పని చేద్దామని తెలిపారు. మాదిగ, మాదిగ ఉప కులాలకు విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాలలో సమాన అవకాశాలు సాధించుకునేందుకు ఐక్య కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాదిగ, మాదిగ ఉప కులాల కో ఆర్డినేషన్ సమితి చైర్మన్ ప్రొఫెసర్ ఖాసీం, ప్రొఫెసర్ మల్లేశం, ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
