TRP వైపు బీసీల భారీ చేరికలు.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చైతన్యం
Published on 22 Mar 2026, 06:14 PM 40
JH-79631
జనహితం న్యూస్ హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కొత్త తరహా చైతన్యానికి నాంది పలుకుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) వైపు రోజురోజుకూ చేరికలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బీసీ సమాజం నుండి అధిక సంఖ్యలో నాయకులు, యువకులు TRP వైపు మొగ్గు చూపడం గమనార్హం. అధికార పార్టీలలో అన్యాయం ఎదుర్కొన్న వర్గాలు ఇప్పుడు తమ హక్కుల కోసం ఐక్యంగా ముందుకు వస్తున్నాయి.
నారపల్లి _ కొర్రెముల నుంచి భారీగా చేరికలు
ఈరోజు హైదరాబాద్‌లోని TRP కేంద్ర కార్యాలయంలో నారపల్లి, కొర్రెముల ప్రాంతాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు తమ పదవులకు రాజీనామా చేసి TRP పార్టీలో రాష్ట్ర క్రమశిక్షణ చైర్మన్ బందారపు నర్సయ్య గౌడ్, నాయకులు రాజేష్, కళ్యాణ్ గార్ల ఆధ్వర్యంలో చేరడం జరిగింది,పార్టీ అధినేత MLC తీన్మార్ మల్లన్న గారు కొత్తగా చేరిన వారికి కండువా కప్పి స్వాగతం పలికారు.
మన వర్గాల భవిష్యత్ కోసం TRP పుట్టింది_ మల్లన్న
ఈ సందర్భంగా మల్లన్న గారు మాట్లాడుతూ ఏండ్ల తరబడి బీసీ వర్గాలకు జరుగుతున్న అన్యాయం చూసి ఇక మౌనం వీడాల్సిన సమయం వచ్చిందన్నారు, మన భవిష్యత్, మన హక్కుల కోసం TRP పుట్టిందని స్పష్టం చేశారు.
గ్రామ స్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఎక్కడ మన వర్గాల వారికి అన్యాయం జరిగినా పార్టీగా అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో మనందరం ఐక్యంగా పోరాడి గెలుద్దామని నినదించారు.
మా కోసం మాట్లాడే నాయకుడు దొరికాడు _ కొత్తగా పార్టీలో చేరిన సభ్యులు
కొత్తగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ,ఇప్పటివరకు మన వర్గాల కోసం ధైర్యంగా నిలబడే నాయకత్వం లేకపోవడంతో మౌనంగా ఉన్నామని తెలిపారు,ఇప్పుడు TRP రూపంలో ఒక బలమైన వేదిక లభించిందని, ఇక తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యామని ప్రకటించారు.
పార్టీలో చేరిన వారి వివరాలు
S. అవినాష్, B. అనిల్, V. వైదీక్, G. జితేందర్, G. కళ్యాణ్, P. ప్రవీణ్, E. చింటూ, B. గులాబ్ సింగ్, N. తుకారాం, Y. మణిదీప్, Ch. సురేష్, B. రాజేష్.
బీసీ చైతన్యం మొదలైంది భవిష్యత్ బీసీలదే
రాష్ట్రవ్యాప్తంగా బీసీ సమాజంలో చైతన్యం పెరుగుతోంది. తమ హక్కుల కోసం, సమాన అవకాశాల కోసం ఇప్పుడు వారు ఐక్యంగా ముందుకు వస్తున్నారు,ఈ మార్పు భవిష్యత్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనుందని స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ కార్యక్రమంలో TRP పార్టీకి చెందిన పలు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
