NRB బేరింగ్ కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న TRP అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
Published on 27 Mar 2026, 07:24 PM 51
JH-77920
జనహితం న్యూస్, హైదరాబాద్ : ఒక్కో కార్మికుడికి ₹10 లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్-అదనంగా కీలక బెనిఫిట్స్
ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా కార్మికుల కోసం కొత్త దారిని చూపించిన TRP కార్మిక విభాగం
ఉప్పల్‌లోని NRB బేరింగ్ కంపెనీ కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు. ఎన్నికల సమయంలో గెలిస్తే ప్రతి కార్మికుడికి ₹10 లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సొంత నిధులతో అందిస్తానని ఇచ్చిన మాటను నేడు కార్యరూపం దాల్చించారు.
కంపెనీ ప్రాంగణంలో కార్మికులు ఏర్పాటు చేసిన సమావేశంలో స్వయంగా ఇన్సూరెన్స్ కార్డులను కార్మికులకు అందజేశారు. మొత్తం 111 మంది కార్మికులకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, అదనంగా 404 కుటుంబాలకు ₹1 లక్ష ఫ్యామిలీ ఇన్సూరెన్స్ కూడా కల్పించడం జరిగింది.
- యాక్సిడెంట్ వల్ల మరణం జరిగితే ₹10,00,000
- శాశ్వత పూర్తిస్థాయి వైకల్యం ₹10,00,00
- తాత్కాలిక వైకల్యం వారానికి ₹10,000 (గరిష్టంగా 100 వారాలు)
- యాక్సిడెంట్ హాస్పిటలైజేషన్ ₹3,00,000 వరకు
ఈ సందర్భంగా మల్లన్న గారు మాట్లాడుతూ ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా కూడా కార్మికుల భద్రత కోసం ఇలాంటి సమగ్ర ఆలోచనతో, కార్మికుల జీవితం మరియు వారి కుటుంబ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి స్కీములు కార్మిక సంఘాలు తీసుకురాలేదని స్పష్టం చేశారు. చాలా చోట్ల కార్మిక సంఘాలు కేవలం సమస్యలు చెప్పడానికే పరిమితం అవుతున్నాయని, కానీ వాటికి స్థిరమైన పరిష్కారాలు చూపే దిశగా ముందుకు రావడం చాలా అరుదని పేర్కొన్నారు.
TRP కార్మిక విభాగం మాత్రం కార్మికుల కష్టాన్ని అర్థం చేసుకుని, వారి భద్రత కోసం ముందుండి స్వంత నిధులతో ఇలాంటి పథకాలను అమలు చేయడం ఒక కొత్త దిశగా నిలుస్తుందని చెప్పారు.
కార్మిక సోదరుని కంటికి రెప్పలా కాపాడుకోవడమే మా యూనియన్ లక్ష్యం. కార్మికుడికి ఏ సమస్య వచ్చినా అది నా సమస్యగా తీసుకుంటా. వారి కుటుంబాలకు ఎటువంటి కష్టం వచ్చినా ముందుండేది మేమే అని హామీ ఇచ్చారు.
వెంకటయ్య, శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని తెలిపారు. నన్ను గెలిపించిన వారికైనా, ఓటు వేయని వారికైనా తేడా లేకుండా అందరికీ ఈ ఇన్సూరెన్స్ అందించడం జరిగింది. మనందరం ఐక్యంగా ఉండి ఎవరికి ఆపద వచ్చినా అండగా నిలబడాలి అని పిలుపునిచ్చారు.
