గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన – బీసీ హామీల అమలుకు డిమాండ్
Published on 26 Mar 2026, 04:54 PM 39
JH-88654
జనహితం న్యూస్ హైదరాబాద్: ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేసారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను దగా చేస్తోందనీ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీని వెంటనే అమలు చేయాలి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని బీసీ కార్పొరేషన్లను తక్షణమే నిధులు విడుదల చేసి ఆదుకోవాలనీ, గొల్ల, కురుమల పొట్ట కొట్టొద్దు.. రెండో విడత గొర్రెల పంపిణీ వెంటనే చేపట్టాలి కోరారు.
👉 Read Also
కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం బీసీ సబ్ ప్లాన్ ను వెంటనే అమలు చేయాలనీ, ముదిరాజ్, గంగపుత్రులను ఆదుకోవాలి.. మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ కొనసాగించాలి పేర్కొన్నారు.
ఓట్ల కోసం బీసీలను వాడుకుని వదిలేసిన కాంగ్రెస్.. హామీలు నెరవేర్చేదాకా పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
