హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
విద్య, వైద్యం మా ప్రభుత్వ ప్రాధాన్యతలు: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ JH-26689

జనహితం న్యూస్ హైదరాబాద్: డిసెంబ‌ర్ 6 2023 వ‌ర‌కు ఆరోగ్య శ్రీ కోసం ప్ర‌తి నెల యావ‌రేజ్ గా 89 కోట్లు ఖ‌ర్చు చేస్తోంది...

రాజీవ్ ఆరోగ్య బ‌కాయిల వ‌ల్ల ప్ర‌వైట్ ఆస్ప‌త్రులు మూత ప‌డుతున్నాయ‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు.. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఆరోగ్య శ్రీ బ‌కాయిలు పెట్టింది.. వాటిని మోస్తూనే ఐదు ల‌క్ష‌ల నుంచి 10 ల‌క్ష‌ల‌కు 

  • 7.12 .2023 నాఇటి 627 పెండింగ్ బ‌కాయిలుగా మాకు భారం వ‌చ్చింది
  • 8.12.2023 నాటికి ఈ రోజు వ‌ర‌కు 2408 కోట్ల రూపాయ‌ల‌ను ఆరోగ్య శ్రీ కోసం చెల్లించాం 
  • ఇందులో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో 927 కోట్ల‌, ప్ర‌వైట్ ఆస్ప‌త్రుల‌కు 1480 కోట్లు చెల్లించాం
  • ఈ రోజు వ‌ర‌కు ఉన్న బ‌కాయిలు 727 కోట్లు మాత్ర‌మే

ఎప్ప‌టిక‌ప్పుడు చెల్లింపులు జ‌రుగుతున్నాయి.. గ‌త ప్ర‌భుత్వం ఇచ్చిన బ‌కాయిలే పెండింగ్ లో ఉంటున్నాయి.. ప్ర‌వైట్ ఆస్ప‌త్రుల‌కు ఆరోగ్య శ్రీ బ‌కాయిలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయి.

ఆరోగ్య శ్రీ చెల్లింపుల‌పైన అపోహ‌లు క‌ల్పిస్తున్నారు.. ఆరోగ్య శ్రీ లో వైద్యం చేయించుకునే రోగుల సంఖ్య పెరిగింది.. 

ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి చెక్ ల విష‌యంలో గ‌తంలో అనేక అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయి.. కొంత మంది ఈ స‌హాయ నిధి దుర్వినియోగం చేశారు..కేసులు కూడా పెట్టారు 

మా ప్ర‌భుత్వం వ‌చ్చాక ఆన్ లైన్ లో సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసేలా చ‌ర్య‌లు తీసుకున్నాం.. దీని వ‌ల్ల అక్ర‌మాల‌కు అవ‌కాశం లేకుండా పోయింది. 

ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 2046 కోట్ల రూపాయ‌లు ఇచ్చాం.. ఆరోగ్య శ్రీ కోసం 2400 కోట్ల ఖ‌ర్చు చేశాం.

పేద‌ల వైద్యం కోసం 4500 కోట్ల రూపాయ‌లను మా ప్ర‌భుత్వం ఇచ్చింది.. రాష్ట్రంలో 35 మెడిక‌ల్ కాలేజీలు ఉన్నాయి.. టీచింగ్ కాలేజీల‌కు రోగులురావ‌డం లేదు.

పేద‌లు వైద్యం కోసం వెళ్లే ద‌గ్గ‌ర స‌రైన డాక్ట‌ర్లు లేవు.. ఆరోగ్య శ్రీ రోగుల‌ను టీచింగ్ కాలేజీల‌కు పంపించే ఆలోచ‌న చేస్తున్నాం.. 

ఆరోగ్య శ్రీతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ ను ఈ ఆస్ప‌త్రుల‌కు ఇస్తాం.. దీని వ‌ల్ల ఆస్ప‌త్రుల నిర్వ‌హ‌ణ మెరుగు ప‌డుతుంది.

ఆస్ప‌త్రుల నిర్వ‌హ‌ణ‌ను గ్రూప్ వ‌న్ అధికారికి ఇవ్వాల‌ని అనుకుంటున్నాం..  కుల‌గ‌ణ‌న‌లో భాగం గా చేసిన జ‌న‌గ‌ణ‌న ఆధారంగా కోటీ 15 ల‌క్ష‌ల కుటుంబాల‌కు ఇందిర‌మ్మ జీవిత బీమా ఇవ్వ‌బోతున్నాం.

దీని వ‌ల్ల ప్ర‌తి కుటుంబానికి ధీమా క‌ల్పించ‌బోతున్నాం.. మ‌న వాళ్లు వేల మంది డాక్ట‌ర్లు విదేశాల్లో ప‌నిచేస్తున్నారు.

విదేశాల్లో ప‌నిచేసే మ‌న డాక్ట‌ర్ల కోసం ప్ర‌త్యేకంగా వెబ్ సైట్ త‌యారు చేస్తున్నాం.. మ‌న ప్రాంతానికి వాళ్లు వ‌చ్చిన‌ప్పుడు ఇక్క‌డ ఆస్ప‌త్రుల్లో సేవ‌లు అందించ‌డానికి వెబ్ సైట్ ద్వారా ఏర్పాట్లు చేస్తున్నాం.

మెడిక‌ల్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ ద్వారా ఈ వెబ్ సైట్ ను ఏర్పాటు చేస్తున్నాం.. వ‌రంగ‌ల్, అల్వాల్, ఎల్ బీ న‌గ‌ర్, స‌న‌త్ న‌గ‌ర్ టిమ్స్ ఆస్ప‌త్రుల‌ను స్పెష‌లైజేష‌న్ ఆస్ప‌త్రులుగా మారుస్తున్నాం.

ఆరోగ్య శ్రీ, సీఎం రీలీఫ్ ఫండ్ ద్వారా ఇచ్చే నిధుల‌ను ఈ ఆస్ప‌త్రుల కు కేటాయిస్తాం.. గోషామ‌హ‌ల్ లో 30 ఎక‌రాల్లో 3000 కోట్ల‌తో ఉస్మానియా కొత్త ఆస్ప‌త్రిని నిర్మిస్తున్నాం.

అద‌నంగా 10 వేల బెడ్ లు రోగుల కోసం అందుబాటులోకి తీసుకువ‌స్తున్నాం.. టిమ్స్ ఆస్ప‌త్రుల ప‌నులు వేగంగా చేస్తున్నాం.. గ‌తంలో జ‌రిగిన పొర‌పాట్ల‌ను స‌రిదిద్దుకుంటు వ‌స్తున్నాం.

దామోద‌ర రాజ‌న‌ర్సింహా ఇంజ‌నీర్ అయిన‌ప్ప‌టికి సోష‌ల్ డాక్ట‌ర్.. ఆయ‌న కు పేద‌ల క‌ష్టాల‌పైన సంపూర్ణ‌మైన అవ‌గాహ‌న ఉంది.. వైద్యంలో నిరంత‌రం కొత్త స‌వాళ్లు ఎదుర‌వుతాయి.

వైద్య ఆరోగ్య శాఖ ఒక స‌వాల్ లాంటిది. భ‌విష్య‌త్తులో అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకురాబోతున్నాం.. స‌భ్యులు ఇచ్చే స‌ల‌హాలను స్వీక‌రిస్తాం

విద్య‌, వైద్యం మా ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌లు .. విద్య అందుబాటులో ఉన్నా నాణ్య‌మైన విద్య లేదు.. పేద‌ల విద్య , వైద్యం విష‌యంలో ఒక్క రూపాయి కూడా కోత విధించం అవ‌స‌ర‌మైతే మ‌రిన్ని నిధులు ఇస్తాం.

Click to join Whatsapp channel
Janahitham News
విద్య, వైద్యం మా ప్రభుత్వ ప్రాధాన్యతలు: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ
విద్య, వైద్యం మా ప్రభుత్వ ప్రాధాన్యతలు: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ

→ జెండా రమేష్ - రిపోర్టర్