హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
ఛలో ఇందిరా పార్క్ జయప్రదం చేయండి: ఎమ్మార్పీఎస్ పిలుపు JH-67984

జనహితం న్యూస్:

నిరాహార దీక్షకు మార్చి 30న హైదరాబాద్ ఇందిరా పార్క్‌కు తరలిరావాలని ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు భూమయ్య మాదిగ పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ మేడి పాపన్న మాదిగ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాసి మోహన్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

SC సంక్షేమ పథకాల సాధనకై “మాదిగ దండోరా” కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ఇందిరా పార్క్‌కు పెద్ద ఎత్తున హాజరుకావాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలను త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయ హస్తం కింద ₹12 లక్షల ఆర్థిక సాయాన్ని తక్షణమే అందించాలని, అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమిని కేటాయించాలని పేర్కొన్నారు. అలాగే G.O. నం. 58, 59 ప్రకారం పట్టాలు ఇచ్చి అమ్ముకునే హక్కు కల్పించాలని కోరారు.

విద్యా రంగంలో కార్పొరేట్ విద్యాసంస్థల్లో 25% ఉచిత విద్యను తప్పనిసరిగా అమలు చేయాలని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నిధుల కింద ₹15 వేల కోట్లను కేటాయించి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

కార్మికులకు గుర్తింపు కార్డులు జారీ చేసి, 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనంగా ₹20,000 ఇవ్వాలని కోరారు.

లీడ్ క్యాప్ పునరుద్ధరణతో పాటు తోలు పరిశ్రమ అభివృద్ధికి ₹10,000 కోట్లను కేటాయించి, చైర్మన్‌ను నియమించి మాదిగ యువతకు ఉపాధి కల్పించాలని సూచించారు.

ఇంద్రమ్మ ఇల్లు పథకంలో ₹5 లక్షల ఆర్థిక సాయంతో పాటు ఎస్సీలుగా గుర్తించి ఇసుక, స్టీల్, సిమెంట్ ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు.

ఈ పథకాలు ఎస్సీ కులాల్లోని ప్రతి దళిత కుటుంబానికి వర్తించే విధంగా ఉన్నందున, ప్రతి ఒక్కరూ నిరాహార దీక్షకు తరలిరావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రూసేగం భూమయ్య మాదిగ, బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ రవికుమార్, మండల అధ్యక్షులు శంకర్ మాదిగ, సీనియర్ నాయకులు రాములు, మెక్కా రమేష్ మాదిగ, మాజీ అధ్యక్షులు సాయిలు, సురేష్, విట్టల్, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
ఛలో ఇందిరా పార్క్ జయప్రదం చేయండి: ఎమ్మార్పీఎస్ పిలుపు
ఛలో ఇందిరా పార్క్ జయప్రదం చేయండి: ఎమ్మార్పీఎస్ పిలుపు

→ గోనె సాయిలు - ఎడిటర్‌ / సీనియర్ రిపోర్టర్